Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.3 కోట్ల రోహిత్ శర్మ చేతి వాచ్ లాక్కోబోయిన ఫ్యాన్స్... షాకింగ్ వీడియో!

Rohit Sharmas 3 Crore Watch Almost Stolen by Fans Shocking Video
Advertisement
  • కారులో ఉన్న రోహిత్ శర్మ చేతి వాచ్ లాగేందుకు అభిమానుల యత్నం
  • రోహిత్ ధరించిన వాచ్ విలువ సుమారు రూ.3.25 కోట్లని నెట్టింట‌ ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
Advertisement
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అభిమానుల నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అతడి చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ను ఇద్దరు యువకులు లాగేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన‌ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు.

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో.. రోహిత్ శర్మ తన కారు వెనుక సీట్లో కూర్చుని బయట ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. మొదట అంతా సాధారణంగానే ఉన్నా, ఇద్దరు యువకులు కారుకు అత్యంత సమీపంగా వచ్చారు. రోహిత్ చేతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ, వారిలో ఒకరు అతని చేతి వాచ్‌ను తీసుకునేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైన రోహిత్, కారు అద్దాన్ని పైకి లాగి, వారిని దూరంగా వెళ్ల‌మని గట్టిగా హెచ్చ‌రించాడు. వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ ధరించిన ఆ వాచ్ రోలెక్స్ "జిరాఫ్" మోడల్ అని, దాని విలువ సుమారు రూ. 3.25 కోట్లు ఉంటుందని కొందరు సోషల్ మీడియా యూజర్లు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో హిట్‌మ్యాన్ తన అద్భుత‌మైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లో 84 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఆడిన 10 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి ప్లేఆఫ్ ఆశలను దాదాపుగా సంక్లిష్టం చేసుకుంది. లక్నోపై విజయం జట్టులో కొంత ఆత్మవిశ్వాసం నింపగా, ఎంఐ త‌న తదుపరి మ్యాచ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.
Advertisement
Advertisement
Rohit Sharma
Mumbai Indians
IPL 2024
Rolex Giraffe
Cricket
Fan incident
Watch theft attempt
Lucknow Super Giants
Royal Challengers Bangalore

More Telugu News